ద్యావుడా.. ఒకేసారి ఇద్దర్ని లగ్గం చేసుకుండు !

by Shyam |
ద్యావుడా.. ఒకేసారి ఇద్దర్ని లగ్గం చేసుకుండు !
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన ‘ఆవిడ మా ఆవిడే’ సినిమా గుర్తుంది కదా.. అచ్చం అలాంటి స్టోరీనే రియల్ లైఫ్‌లోనూ జరిగింది. కాకుంటే మూవీలో ఒకరికి తెలియకుండా ఒకర్ని పెళ్లిచేసుకొని చివరలో అసలు విషయం బయటపెడతాడు. కానీ ఇక్కడ అందర్నీ ఒప్పించి ఒకే మండంపంలో ఇద్దరు యువతులను లగ్గం చేసుకున్నాడు ఓయువకుడు. వినేందుకు కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అదేంది ఒక భార్యనే పెళ్లి చేసుకొని సంసారాన్ని ఈదలేక అష్టకష్టాలు పడుతుంటే ఏకంగా ఇద్దర్నీ ఒకేసారి ఎలా పెళ్లి చేసుకున్నాడు. దానికి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ ఎలా ఒప్పుకున్నారని ఓ సందేహం రావచ్చు. కానీ అందర్నీ ఒప్పించి, మెప్పించి ఇరువురి వధువుల కుటుంబ సభ్యులు సంతోషాల నడుమ మండపంలో ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ మ్యారేజ్ ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో వివరాలు తెలుసుకుందాం.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ దగ్గర్లోని త్రికాలొహం అనే గ్రామంలో చందుమౌర్య అనే యువకుడు 19 ఏళ్ల హసినా, 21 ఏళ్ల సుందరితో ఒకేసారి ప్రేమలో పడ్డాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్‌ను కంటిన్యూ చేశాడు. అయితే తీరా చందుమౌర్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా ఒక్కర్నే పెళ్లి చేసుకోవాలని సూచించారు. కానీ యువకుడికి ఏ అమ్మాయిని వదులుకోవాలో అర్థంకాక తలపట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో చేసేదీ ఏమీలేక యువతుల తల్లిదండ్రులు, బంధువులను బతిమిలాడుకొని.. వారిని ఓకే చెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ఒకే మండపంలో ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టి, ఏడు అడుగులు నడిచాడు.

ప్రజెంట్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమ ప్రాంతంలో ఇలాంటి పెళ్లి జరగడం ఇదే ఫస్ట్ టైమ్ అని స్థానికులు చెబుతున్నారు. నీవు గ్రేట్ సామీ, నీకు నీవే సాటి.. ఒక్క భార్యతో సంసారం ఈదలేకనే తలలు పట్టుకుంటుంటే నీవు ఏకంగా ఒకేసారి మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టావు. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.

Advertisement

Next Story