మోచేతి మీద కొత్త పురుషాంగం.. ప్రపంచంలోనే మొదటిసారి!

by sudharani |
మోచేతి మీద కొత్త పురుషాంగం.. ప్రపంచంలోనే మొదటిసారి!
X

ఎలాంటి ఇంట్రో అవసరం లేకుండా నేరుగా మ్యాటర్‌లోకి రావాల్సినంత వైవిధ్యమైన వార్త ఇది. ఎందుకంటే ఇలాంటి సర్జరీ ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరికీ జరగలేదు. యూకేకి చెందిన మాల్కమ్ మెక్‌డొనాల్డ్ అనే వ్యక్తి ఓ వ్యాధి బారిన పడి తన పురుషాంగాన్ని కోల్పోయాడు. ఇప్పుడు డాక్టర్లు కష్టపడి ఆపరేషన్ చేసి తన ముంజేతి చివర, మోచేయికి దగ్గరల్లో కొత్త పురుషాంగాన్ని అమర్చారు. వినడానికి చాలా వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం. మెకానిక్‌గా పనిచేసే మాల్కమ్ 2014లో పెరినియం ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డాడు. అది సెప్సిస్‌గా మారడంతో అతని చేతివేళ్లు, కాలివేళ్లు, మర్మాంగాలు నల్ల రంగుకి వచ్చాయి. అది మరింత తీవ్రమై పురుషాంగం ఊడిపోయే స్థాయికి చేరుకుంది.

ఆ బాధ తట్టుకోలేక మద్యానికి బానిసగా మారాడు. దాదాపు రెండేళ్ల పాటు పురుషాంగం లేకుండానే బతికాడు. ‘ఏదో ఒకరోజు అది ఊడిపోతుందని నాకు తెలుసు. అనుకున్నట్లుగానే ఒకరోజు అది ప్యాంటులో నుంచి జారి కిందపడింది. నా చేతులతో నేనే దాన్ని పట్టుకుని డస్ట్‌బిన్‌లో వేసి బయటపడేశాను’ అని మాల్కమ్ గతంలో ఓ లండన్ పత్రికకు చెప్పారు. అప్పటి నుంచి తను ఆత్మవిశ్వాసం కోల్పోయి, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా బతుకుతూ తాగుబోతుగా మారినట్లు మాల్కమ్ చెప్పారు. తర్వాత ఒకనాడు లండన్ యూనివర్సిటీ కాలేజీ హాస్పిటల్‌లో పనిచేసే ప్రొఫెసర్ డేవిడ్ రాల్ఫ్, మాల్కమ్‌కు ఒక శుభవార్త చెప్పాడు. పుట్టుకతో పురుషాంగం లేకుండా జన్మించిన వ్యక్తికి బయోనిక్ పురుషాంగాన్ని అమర్చిన సంఘటన గురించి వివరించారు. అయితే ఆపరేషన్‌కు రెండేళ్లు పడుతుందని, ఖర్చు కూడా ఎక్కువే అవుతుందని రాల్ఫ్ చెప్పాడు.

తనకు సరిగా మూత్ర విసర్జన చేసే అవకాశం వస్తుందనే సంతోషంతో మాల్కమ్ ఆపరేషన్‌కు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతనికి 50వేల పౌండ్ల విరాళం కూడా లభించింది. కానీ కరోనా పాండమిక్ కారణంగా సర్జరీ తేదీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ ఆపరేషన్ మొదటి దశ సర్జరీ ఇటీవలే పూర్తయింది. మాల్క‌మ్ రక్తనాళాలను ఉపయోగించి ఒక కొత్త పురుషాంగాన్ని సృష్టించారు సర్జన్లు. కుడి భుజం నుంచి కొంత చర్మం తీసుకుని రెండు రక్తనాళాలను ట్యూబ్‌లుగా పెట్టి, ఒక హ్యాండ్ పంపుతో కలిపి మోచేతికి అమర్చారు. ఈ హ్యాండ్ పంప్ ద్వారా పురుషాంగం యాంత్రికంగా నిలబడేందుకు అవకాశం ఉంటుంది. మోచేతి భాగంలో పురుషాంగ చర్మకణాలు, మాల్కమ్ శరీర కణాలతో మిళితం అయ్యాక దాన్ని కత్తిరించి రెండో దశ సర్జరీలో పెట్టాల్సిన చోట పెట్టి కుట్టేస్తారు.

Advertisement

Next Story

Most Viewed