టాయిలెట్ తీసిన ప్రాణం

by Sumithra |
టాయిలెట్ తీసిన ప్రాణం
X

దిశ, వెబ్‌డెస్క్: మూత్రం పోసేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇదేంటని ఆశ్యర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
తిమ్మారెడ్డిపల్లికి చెందిన రాములు (50) పని నిమిత్తం వికారాబాద్ నుంచి ముంబై‌కి బయల్దేరాడు. బస్సు ఎక్కిన తర్వాత అర కిలో మీటర్ ప్రయాణించాడో లేదో మూత్ర విసర్జనకు వెళ్లాలని డ్రైవర్‌ను కోరాడు. దీనికి బధులిచ్చిన డ్రైవర్ కొద్దిగా ముందుకెళ్లాక ఆపుతాను అని చెప్పాడు. అంతలోనే విసిగిపోయిన రాములు బస్సు డోర్‌ నుంచి బయటకు దూకేశాడు. ఇదే సమయంలో బస్సు కాస్తా వేగంగా ఉండడంతో రోడ్డు మీద తటస్థంగా నిలబడలేక కిందపడిపోయాడు. ఈ క్రమంలో తలకు బలమైన గాయం కావడంతో స్పాట్‌లోనే చనిపోయాడు.

Advertisement

Next Story

Most Viewed