దారుణం: మైనర్‌ బాలుడిని వదలని కామాంధుడు.. మటన్‌ షాపులోకి లాకెళ్లి

by Sumithra |   ( Updated:2021-11-19 08:52:48.0  )
దారుణం: మైనర్‌ బాలుడిని వదలని కామాంధుడు.. మటన్‌ షాపులోకి లాకెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగంలో కామాంధుల వికృత క్రీడలు పెరిగిపోతున్నాయి. వావి-వరుసలు మరిచిన ప్రబుద్ధుల లైంగిక దాడులతో అమాయకులు బలవుతున్నారు. బాధిత జాబితాలో మైనర్‌ బాలికలు/బాలురు‌లు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇటువంటి దారుణ ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..

థానే జిల్లా అంబర్‌నాథ్ టౌన్‌లో ఓ వ్యక్తి (35) మటన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఇదే షాపులో ఓ మైనర్ బాలుడు(14) పని చేస్తున్నాడు. నవంబర్ 14న ఆదివారం కావడంతో శనివారం అర్ధరాత్రి బాలుడు పని కోసం వచ్చాడు. ఆ సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో బాలుడిని కోరిక తీర్చాలంటూ వేధించాడు యజమాని. ఒప్పుకోకపోవడంతో గోడకేసి కొట్టి దాడి చేశాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు జరిగిన విషయాన్ని బాలుడు తన తల్లికి చెప్పడంతో షాపు యజమానిని నిలదీశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవంబర్ 18న నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story