లాక్ చేసిన గదిలో.. 5 సంవత్సరాల పాటు లైవ్‌స్ట్రీమ్

by Shyam |   ( Updated:2021-04-17 02:40:22.0  )
Locked Room for 100 Days
X

దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలంలో కొన్ని రోజులు బయటకు రాకుండా ఉంటేనే అతలాకుతలం అయిపోయాం. అప్పటికీ ప్రతిరోజు నిత్యావసరాలకు వెళ్లే అవకాశం ఉండటంతో పాటు కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు. కానీ సమాజంతో డిస్‌కనెక్ట్ అయిన ఆ మూడు నెలలు భరించలేకపోయాం. ఎంతోమంది ఒంటరిగా ఫీల్ అయ్యారు. అలాంటిది లాస్‌ఏంజిల్స్‌కు చెందిన ఆర్టిస్ట్ టిమ్ సీ ఇంజానా మాత్రం లాక్ చేసిన రూములో 100 రోజులు గడిపాడు. అంతేకాదు మరో ఐదేళ్ల వరకు అదే రూములో ఉంటానంటున్నాడు. ఇంతకీ ఇది సాధ్యమేనా? అక్కడ అతడు ఏం చేస్తున్నాడు?

Man Has Been

ఈ ఏడాది ప్రారంభంలో అందరూ న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోతే, ఇంజానా మాత్రం ఓ గదిలో తనను తాను బంధించుకునే హడావిడిలో ఉండిపోయాడు. అప్పటి నుంచి ప్రపంచానికి తాను దూరమై, ఓ గదిలో నివసిస్తున్న 34 ఏళ్ల ఇంజానా.. తను ఏం చేస్తున్నాడో ప్రపంచానికి చూపించేందుకు 24/7 లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఈ ఏడాదిలో మొదటి 100 రోజులు గడిపిన అతడు, సరైన ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందినట్లయితే మిగిలిన సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం(5 సంవత్సరాలు) అక్కడే ఉండాలని యోచిస్తున్నాడు. ఇలా ఏడాది పాటు లేదా మరికొంత కాలం అక్కడే గడిపాక తన లైవ్ స్ట్రీమ్‌ను కస్టమ్ ఫ్రేమ్‌లో ‘అన్‌యూజ్‌వల్ పీస్ ఆఫ్ ఆర్ట్‌’గా అమ్మాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం ట్విచ్‌లో తన రోజువారీ జీవితాన్ని ఉచితంగా ప్రసారం చేస్తున్నాడు. కానీ తను చేస్తున్న పనికోసం ఎవరైనా 5 మిలియన్ ఖర్చు చేస్తే 5 సంవత్సరాల పాటు, 10 మిలియన్ చెల్లించడానికి అంగీకరిస్తే వరుసగా 10 సంవత్సరాలు ఒంటరిగా ఉండేందుకు కూడా ముందుకొచ్చాడు.

Tim C Inzana

కేవలం ఒక గదిలో 24/7 ఒంటరిగా ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుంది? అంటే అది ఇంజానాను చూస్తే తెలుస్తుంది. మధ్యాహ్నం కంప్యూటర్ ముందు కూర్చొని తన వ్యూయర్స్‌తో Q & A సెషన్లు చేస్తూ కూర్చుంటాడు. వ్యూయర్స్‌లో ఒకరు డీజే అరెంజ్ చేస్తే, వర్చువల్ సోలో డ్యాన్స్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటాడు. సమయానికి తినడం, ధ్యానం చేయడం‌తో పాటు వివిధ కళాకృతులపై పని చేస్తుంటాడు.

Man Has Been

‘ఈ బ్లాంక్ స్పేస్.. రంగురంగుల ప్రదేశంగా రూపాంతరం చెందితే ఎలా ఉంటుందో నాకిప్పుడు అలాగే ఉంది. నిజాయితీగా చెప్పాలంటే.. ప్రస్తుతం నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. నా మనసు చెప్పింది ఫాలో అవుతున్నాను. ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చాలనుకుంటున్నాను. ఈ అసాధారణమైన చాలెంజ్ స్వీకరించే ముందు నా కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదించాను. నా కాబోయే భార్యతో కూడా చర్చలు జరిపాను. తను కూడా నాకు సపోర్ట్ చేయడమే కాకా, అవసరమైన కిరాణా సామాగ్రిని కిటికీ ద్వారా అందిస్తోంది’ అని ఇంజానా వివరించాడు.

Los Angeles artist

Advertisement

Next Story

Most Viewed