- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
61 నిమిషాల్లో మెనూ మొత్తం స్వాహా!
దిశ, వెబ్ డెస్క్ :
సాధారణంగా మనం కడుపు నిండా తింటేనే కాస్త ఆయాస పడిపోతుంటాం. అలాంటిది ఫుడ్ ఈటర్స్ మాత్రం ఒకరిని మించి ఒకరు పోటీపడుతూ అవలీలగా కుంభాలకు కుంభాలు లాగించేస్తుంటారు. వీళ్లంతా తరచుగా ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెయిర్స్ వంటి పోటీల్లో చాలా సీరియస్‌గా పాల్గొంటుంటారు. కాగా ఇటీవలే ఒక యంగ్ ఫుడ్డీ.. ఓ ఫుడ్ కాంటెస్ట్‌లో తన స్థాయికి మించి తిని ప్రాణాలు కోల్పోయాడు కూడా. ఈ సంగతి పక్కనబెడితే, తాజాగా ఓ ఫుడ్డీ.. ఒక మంచి పని కోసం ఫుడ్ పోటీలో పాల్గొని విరాళానికి అవసరమైన మనీ సేకరించాడు.
యూకేలోని సుందర్‌ల్యాండ్‌కు చెందిన కైల్ గిబ్సన్ అనే 22 ఏళ్ల యువకుడు మంచి ఫుడ్ ఈటర్. ఇప్పటికే పలు ఫుడ్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచాడు. ఇటీవలే బ్రిటీష్ ఈటింగ్ లీగ్‌లోను తన సత్తా చాటాడు. తాజాగా అతడు ఓ చారిటీకి విరాళాలు సమకూర్చడం కోసం మరో భిన్నమైన చాలెంజ్‌తో ముందుకొచ్చాడు. అందుకోసం రెస్టారెంట్‌లో ఉండే మెనూ కార్డులోని ఫుడ్ ఐటమ్స్ మొత్తం గంటలో తినాల్సి ఉంటుంది. కాగా, గిబ్సన్ ఈ పోటీలో ఎనిమిది బర్గర్లు, నాలుగు హాట్ డాగ్స్, రెండు కప్పుల ఫ్రెంచ్ ఫ్రైస్, మూడు శాండ్‌విచ్‌లు, బీఎల్టీ శాండ్ విచ్, రెండు మిల్క్ షేక్‌లను కేవలం 61 నిమిషాల్లోనే తినేసి వావ్ అనిపించాడు. దీంతో ఆతడు 400 పౌండ్ల (రూ.39,123) విరాళాన్ని సేకరించగలిగాడు.
న్యూ క్యాజిల్ వెస్ట్ ఎండ్ ఫుడ్ బ్యాంక్.. పేద పిల్లల కోసం ఫుడ్ డొనేట్ చేస్తుంటుంది. సాధారణంగా గిబ్సన్.. ఫుడ్ ఈటింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి ఈ ఫుడ్ బ్యాంకుకు మనీ డొనేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని హాబీస్ గురించి ‘నేను రెగ్యులర్‌గా డైట్ మెయింటైన్ చేస్తుంటాను. నా క్యాలరీలను తగ్గించుకునేందుకు జిమ్ కు వెళ్తుంటాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తింటుంటాను’ అని గిబ్సన్ చెప్పుకొచ్చాడు.