అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Sumithra |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, నర్సంపేట: నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారి కాకతీయనగర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు చెన్నారావుపేట మండలం కోనపురం గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజుకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం మద్యం మత్తులో జరిగి ఉండొచ్చని కొందరు స్థానికులు అంటున్నారు. అంతేగాకుండా దీనిపై మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట ప్రమాదం జరగడం, ఆ పరిధిలో సీసీ టీవీ ఫుటేజీలు లేకపోవడంతో మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story