నిన్న గల్లంతు.. నేడు శవమై!

by Shyam |   ( Updated:2020-05-21 03:09:29.0  )
నిన్న గల్లంతు.. నేడు శవమై!
X

దిశ, మెదక్: అతని వయస్సు 28 ఏళ్లు. అతనికి భార్య, కూతురు కూడా ఉంది. సంసారం ఆనందంగా సాగిపోతున్న వేళ.. అతన్ని దురదృష్టం వెంటాడింది. ఇంతకీ అతనికి ఏమైందో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఉడుత ఎల్లయ్య, పోచవ్వ దంపతులకు రాజు(28) అనే కుమారుడు ఉన్నాడు. లాక్ నేపథ్యంలో పనులేమీ లేకపోవడంతో బుధవారం సాయంత్రం స్నేహితులతో కలసి సమీపంలోని కాల్వకు ఈతకెళ్లాడు. ఈ క్రమంలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా రాజు శవమై తేలాడు. మృతుడికి భార్య లావణ్య, కూతురు శివన్షిక ఉన్నారు. రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story