ఆ భయంతో వ్యక్తి మృతి.. ఖననం చేసిన ఆ నలుగురు

by Shyam |
ఆ భయంతో వ్యక్తి మృతి.. ఖననం చేసిన ఆ నలుగురు
X

దిశ, నాగర్ కర్నూల్: కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఓ వ్యక్తి మనస్థాపానికి గురై పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు(42) నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను మనస్తాపానికి గురై పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిపారు. కాగా మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అదే గ్రామానికి చెందిన మజీద్ కమిటీ ముస్లిం సభ్యులు ఖాజా బాబా, కాజా, మల్లెపల్లి భాష, జోహార్ లు ముందుకొచ్చారు. వారికి గ్రామపంచాయతీ తరుపున అన్ని సహాయ సహకారాలు అందించారు.

Advertisement

Next Story