అక్రమార్కుల పై చర్యలు శూన్యం..

by Sumithra |
అక్రమార్కుల పై చర్యలు శూన్యం..
X

దిశ, ముదిగొండ : ముదిగొండ మండల సువర్ణపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 417 లో ప్రభుత్వ భూమి 2.4 రెండు ఎకరాల నాలుగు కుంటల భూమి కలదు. ఆ భూమి వేంకటగిరి & వల్లబి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అక్రమార్కుల కన్ను ఆ భూమి పై పడింది. ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణ పై దిశ పత్రికలో గత నెలలో వార్త ప్రచురించిన విషయం విధితమే. ఆ వార్తకు స్పందించిన తహశీల్దార్ అక్కడ మనకి గురైన ప్రభుత్వ భూమిని గుర్తించి మార్కులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఉద్దేశం మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. మీరు ఆక్రమించిన భూమిలో ఏమైనా నిర్మాణాలు చేస్తే ఏడు రోజుల్లోగా వాటిని తొలగించాలని ఆ నోటీసులో ఉంది.

ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అక్రమార్కులు స్పందించకపోతే తహశీల్దార్ 15 రోజుల గడువు తర్వాత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నెలలు గడుస్తున్నా అక్రమార్కులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా ఒక మండల తహశీల్దార్ ఇచ్చిన నోటీసులు సైతం లెక్కచేయకుండా దర్జాగా ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ భూమి పై అధికారుల పర్యవేక్షణ లోపం వలన అక్రమార్కులు రెచ్చిపోతున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించిన తర్వాత కూడా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అధికారుల పై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమానికి గురైన భూమిని స్వాధీన పరచుకోవాల్సిందిగా మండల ప్రజలు అధికారులు కోరుతున్నారు.

Advertisement

Next Story