Vijay Antony: దయచేసి నన్ను క్షమించండి.. కీలక ప్రకటన విడుదల చేసిన విజయ్

by Hamsa |   ( Updated:2024-12-31 06:31:16.0  )
Vijay Antony: దయచేసి నన్ను క్షమించండి.. కీలక ప్రకటన విడుదల చేసిన విజయ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోని(Vijay Antony)హీరోగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సుక్రన్’(Sukran) సినిమాకు తన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు సంగీతం అందిస్తూనే హీరోగా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. విజయ్ ఈ ఏడాది రోమియో, తుపాన్, హిట్లర్(Hitler) వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ విజయాన్ని సాధించలేకపోయాడు.

అప్పుడప్పుడు విజయ్ లైవ్ కాన్సర్ట్‌లు నిర్వహిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. అయితే డిసెంబర్‌లో కూడా ఓ ఈవెంట్ ఉండగా అది క్యాన్సిల్ అయింది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ విజయ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశాడు. ‘‘హలో ఫ్రెండ్స్ కొన్ని అనుకోని కారణాల వల్ల, చెన్నైలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు జరగాల్సిన విజయ్ ఆంటోనీ 3.0 లైవ్ కాన్సర్ట్‌(Vijay Antony 3.0 Live Concert)ను ప్రభుత్వ అధికారుల సూచన మేరకు మరొక తేదీకి వాయిదా వేశాము. మీకు కలిగిన అసౌకర్యానికి దయచేసి నన్ను క్షమించండి. కొత్త ఈవెంట్ తేదీ త్వరలోనే ప్రకటిస్తాను’’ అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story