- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత రాజ్యాంగాన్ని విమర్శించటం అంటే మహిళలను అగౌరవ పరచడమే.. బండి పద్మ
దిశ, వైరా : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అంబేద్కర్ ను అగౌరపరిచేలా పార్లమెంట్లో ఒక బాధ్యతగల హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలో మహిళా హక్కులను అవమానించినట్లే అని ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ అన్నారు. ఆదివారం ఐద్వా వైరా పట్టణ కమిటీ సమావేశం బొంతు సమత అధ్యక్షతన బోడేపూడి భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం వచ్చేనాటికి వివిధ కులాలు, వివిధ జాతులు, వివిధ మతాలు వివిధ ప్రాంతాలు, అనేక సంస్కృతులు సంప్రదాయాలతో ఉందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు దీర్ఘకాలికంగా ముందుచూపుతో వివిధ దేశాల అనుభవాలను భారతదేశ ప్రజలను ముఖ్యంగా మహిళలు పట్ల సమానత్వాన్ని కాపాడేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం మార్చేయాలనే పద్ధతిని అవలంబించడం చాలా దుర్మార్గమని అన్నారు.
రాజ్యాంగంలో మహిళా రక్షణ కోసం చేసిన చట్టాలు, అభివృద్ధి కోసం పొందుపరిచిన సంస్కరణలు పాలకులు అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వల్లనే నేటికి మహిళలు అనేక దాడులు హింసలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయటం వల్ల ప్రజలకి ఉపయోగపడుతుందని, రాజకీయ కుట్రతో మనువాదాన్ని చోప్పించి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత మళ్లీ మనల్ని వెనక్కి తీసుకుపోయే ప్రమాద ఘంటికలు కనపడుతున్నాయని అన్నారు. దేశంలో జమిలి ఎన్నికల పేరుతో భారత దేశంలో రాజకీయాధిపత్యాన్ని చలాయించాలని బీజేపీ భావిస్తుందని, దేశ ప్రజల దీనిని అర్థం చేసుకొని బీజేపీ తీసుకునే విధానాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, జిల్లా కమిటీ సభ్యురాలు గుడిమెట్ల రజిత, పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి, నాయకులు బత్తుల ప్రమీల, కాంసాని మల్లికాంబ, తాటి కృష్ణకుమారి, మాడపాటి సుజాత, భూక్యా విజయ తదితరులు పాల్గొన్నారు.