సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

by Naveena |
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి
X

దిశ,నిజాంసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ..సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ 20 రోజులుగా సమ్మె చేస్తున్న పరిష్కారం చూపించకుండా అధికారులు కస్తూర్బాలలో ప్రత్యేక అధికారులను నియమించడంతో..నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గతంలో హనుమకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తపరచిన సమయంలో అప్పటి పిపిసి అధ్యక్షుని హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి సమస్యను తాము అధికారంలోకి రాగానే 10 నిమిషాలలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తమరే అధికారంలో ఉండడం వల్ల తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. రెగ్యులరైజేషన్ రాష్ట్రంలో కొత్తేం కాదని, ఐకెపి వీఆర్ఏలను కాంట్రాక్టు లెక్చరర్ లను రెగ్యులర్ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తమకు రెగ్యులరైజేషన్ చేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని,అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల విద్యాధికారి వై. తిరుపతిరెడ్డి, మహమ్మద్ నగర్ మండల విద్యాధికారి ఎల్ .అమర్ సింగ్ కేజీబీవీ ఇంచార్జి, స్పెషలాఫీసర్ సమత ,ఏం ఐ ఎస్ కోఆర్డినేటర్ జె. రాజు, సిఆర్పిలు కె .వెంకటరామ గౌడ్,వి.శంకర్ గౌడ్,పి. నర్సింలు,బి. శ్రీధర్ కుమార్, పిటిఐలు జి హరీష్, కె.భూమయ్య కేజీబీవీ ఉపాధ్యాయులు రజిత, సరిత, రమాదేవి,పర్జన సిబ్బంది అనిత, కవిత లావణ్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story