ప్రియురాలు అలా చేసిందని ప్రియుడు ఆమెను గదిలోకి లాక్కెళ్లి..

by Sumithra |   ( Updated:2021-07-02 01:24:33.0  )
nellore crime news
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు ప్రేమ పేరుతో ఎంతోమంది మోసపోతున్నారు. కొంతమంది ప్రేమ పేరు చెప్పి యువతులను వేధించడం, వారు ఒప్పుకోకపోతే అతి కిరాతాకంగా వారిని హత్య చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా ఒక ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. తనను దూరం పెడుతుందన్న కోపంతో ప్రియురాలిని ప్రియుడు అతి దారుణంగా కత్తితో పొడిచి, గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. గూడూరులోని తిరుపతి రైల్వేలైన్‌ గేటు సమీపంలో టీచర్లు గా పనిచేస్తున్న పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులకు ఇంజనీరింగ్‌ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం. నాలుగేళ్లుగా తేజస్విని, వెంకటేష్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. బెంగుళూరు లో స్టాఫ్‌వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్న వెంకటేష్ కరోనా లాక్ డౌన్ కావడంతో గూడూరులోనే ఉంటున్నాడు. కాగా, ఇటీవల వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరూ కలవకుండా కట్టడి చేశారు. దీంతో తేజస్విని, వెంకటేష్ ని దూరం పెట్టింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని కొన్ని రోజులుగా తేజస్విని వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే గురువారం యువతి తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లగానే వెంకటేష్‌ వారి ఇంటికి వెళ్లాడు.

తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్ తనతో పాటు తెచ్చిన కత్తితో తేజస్విని గొంతులోపొడిచి, ఆపై టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఫ్యాన్ కి ఉరేసుకున్నాడు. తేజస్విని సోదరుడు అరుపులతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగువారు కిటికీలోంచి చూడగా బెడ్‌పై తేజస్విని రక్తపు మడుగులో కనిపించగా, వెంకటేష్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులకొట్టి . ఇద్దరినీ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని.. వెంకటేష్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story