- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంచు ముక్కల్లో రెండున్నర గంటలు.. సొంత రికార్డు బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రియాకు చెందిన ఓ వ్యక్తి.. టబ్ నిండా మంచు ముక్కలు వేసి, అందులో స్విమ్ సూట్ నిక్కర్ ధరించి రెండున్నర గంటల పాటు ఉండి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా తయారుచేసిన గాజు టబ్‌ను మంచు ముక్కలతో నింపి అందులో భుజాల వరకు మునిగి 2 గంటల 30 నిమిషాల 57 సెకన్ల పాటు ఉన్న జోసెఫ్ కొయిబెర్ల్ రికార్డు సృష్టించాడు. నిజానికి ఐస్ ముక్కల్లో ఎక్కువ కాలం ఇలా గడిపిన గత రికార్డు కూడా జోసెఫ్ పేరు మీదనే ఉంది. అంటే ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడన్నమాట.
ఆ గాజు టబ్‌లో 200 కేజీలకు పైగా ఐస్ ముక్కలను వేసి వాటి ద్వారా కలిగే శీతల ఉష్ణోగ్రతల నొప్పిని తట్టుకోవడానికి తాను పాజిటివ్ భావోద్వేగాల మీద దృష్టిని మరల్చినట్లు జోసెఫ్ తెలిపారు. ఆస్ట్రియాలోని మెల్క్ టౌన్ స్క్వేర్‌లో 2019లో ఇదే విన్యాసాన్ని జోసెఫ్ రెండు గంటల పాటు చేయగలిగారు. అప్పుడు ఎంతో మందికి ఈ విన్యాసాన్ని ప్రత్యక్షంగా వీక్షించే సదుపాయం కల్పించారు. కానీ ఈసారి కొవిడ్ కారణంగా కొద్ది మందికి మాత్రమే ఈ రికార్డు బ్రేక్ చేసే విన్యాసాన్ని లైవ్‌లో చూసే అవకాశం కలిగింది. అలాగే వచ్చే ఏడాది కూడా ఇదే విన్యాసాన్ని లాస్ ఏంజెలీస్‌లో మరోసారి చేసి తన ప్రస్తుత రికార్డును బ్రేక్ చేస్తానని జోసెఫ్ వెల్లడించారు.