కారు.. పేడ.. మట్టి.. తిరుమల శ్రీవారి దర్శనం

by Anukaran |
Car
X

దిశ, వెబ్‌డెస్క్ : కొత్త కారు. తళతళ మెరుస్తూ లగ్జరీ లుక్. ఎంత దూరమైన హాయిగా ప్రయాణించడానికి సౌకర్యవంతమైన కారు. కానీ ఎండల తీవ్రత ఎక్కవైంది. బయటకు వెళ్తే మాడిపోవడం ఖాయం. నాకు ఎండ కొట్టకుండా కారుంది.. మరి కారుకు ఎండ కొట్టకుండా ఏం చేయాలి..? ఇదే ఆలోచించాడు ఆ కారు ఓనర్. బాగా ఆలోచించిన ఆయనకు ఓ మెరుపులాంటి ఐడియా తట్టింది. ఇంకేముంది.. ఎండ తగలకుండా ఆయన, కారు వందల కిలోమీటర్లు ప్రయాణించి తన పని చక్కబెట్టుకున్నారు.

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి శ్రీవారి దర్శనం కోసం సొంత కారులో తిరుమలకు చేరుకున్నారు. అయితే ఆ కారు బాడీ మొత్తానికి పేడ, బంకమట్టి దట్టంగా పూసి ఉన్నది. మొదట దూర ప్రయాణం చేయడం వల్ల అలా మట్టి పడిందని భావించిన భక్తులు.. కారు దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇదే విషయంపై కారు డ్రైవర్ ను ప్రశ్నిస్తే.. కారుకు ఎండ నుంచి ఉపశమనం కోసం ఇలా పేడ, బంకమట్టి పట్టించామని ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తిరుమల నందకం కార్ల పార్కింగ్‌ వద్ద ఉన్న ఈ కారును భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed