మద్యానికి బానిసై వ్యక్తి మృతి

by Shyam |   ( Updated:2020-09-11 08:53:16.0  )
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
X

దిశ, పటాన్‌చెరు: మద్యానికి బానిసై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహేష్ గౌడ్ మద్యం మత్తులో గురువారం సాయంత్రం సాకి చెరువులో పడిపోయాడు. బంధువులు ఎంత వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం సాకి చెరువులో మహేశ్ గౌడ్ శవం తేలింది. మృతుడి తండ్రి యాదగిరి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story