మద్యానికి బానిసైన వ్యక్తి.. చివరకు అనుకోని విధంగా చూసిన భార్య

by Sumithra |
suicide
X

దిశ, రామాయంపేట : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం రాయిలాపూర్‌కు చెందిన రాగి స్వామి (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. స్వామి మద్యం సేవించి వచ్చి భార్య శ్యామలతో తరుచు గొడవపడుతూ.. చనిపోతానని బెదరించేవాడు. శ్యామల మూడు రోజుల క్రితం చెవి ఆపరేషన్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది.

అక్కడి నుంచి నేరుగా అమ్మగారిల్లయినా రాయిన్‌పల్లికి వెళ్లింది. అయితే స్వామి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఆయన తమ్ముడు యాదగిరి వెళ్లి చూడగా స్వామి దూలానికి ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. దీంతో యాదగిరి వదిన శ్యామలకు సమాచారమివ్వడంతో ఆమె రాయిలాపూర్‌కు చేరుకొని బోరున విలపించింది. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story