Tessa Joseph : ఇప్పటికీ నా బాడీ‌పై కామెంట్స్ ఎదుర్కొంటున్నా

by Shyam |   ( Updated:2021-05-25 05:29:05.0  )
Tessa Joseph : ఇప్పటికీ నా బాడీ‌పై కామెంట్స్ ఎదుర్కొంటున్నా
X

దిశ, సినిమా : మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ‘పట్టాలమ్’ సినిమాలో కోస్టార్‌గా నటించిన టెస్సా జోసెఫ్ (Tessa Joseph) బాడీ షేమింగ్‌పై ఎమోషనల్ నోట్ రాసింది. చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వారంతా తనను ఫ్యాట్‌‌గానే గుర్తించేవారని ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. తను చిన్న పిల్లగా లేదా మహిళగా ఎప్పుడు కూడా ‘నువ్వు పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నావ్’ అనే మాటను వినలేదన్న టెస్సా.. లావుగా ఉన్నాననే విషయాన్ని తనతో నిర్మొహమాటంగా చెప్పేవారని తెలిపింది. సొసైటీ కూడా సన్నగా, ఫెయిర్‌గా, పొడవుగా ఉంటేనే పర్ఫెక్ట్ షేప్ అంటూ కొన్ని రూల్స్ సెట్ చేసిందని, ఈ సొసైటల్ కండిషన్స్ ఆధారంగానే చాలామంది అమ్మాయిలు తాము లావుగా ఉన్నామనుకొని బాధపడుతుంటారని తన పోస్టు ద్వారా బాడీ పాజిటివిటీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది.

‘సామాజిక పరిస్థితులు వృద్ధాప్యాన్ని అంగీకరించేందుకు అడ్డుపడతాయి. ఎక్కువ వయసున్న చాలామంది నటులు, మోడల్స్ యంగ్‌గా కనిపించే చిత్రాలు కూడా ఇందుకు దోహదపడతాయి. అయితే అలా కనిపించేందుకు వాళ్లు భారీగా ఖర్చుచేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. మీ వయసుకు తగ్గ బరువు ఉన్నారని చెప్పేందుకు ఇదే సరైన సమయం. మీ శరీరాకృతి సహజంగా ఉంటే, అదే పర్ఫెక్ట్ సైజ్. మీ శరీరాకృతి పట్ల మీరు సంతోషంగా ఉన్నంత వరకు, ఆ విషయంపై మిమ్మల్ని కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ సొసైటీలో ఎవరైనా బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ కామెంట్స్ ద్వారా ఇతరుల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మనందరం మనుషులమే అన్న విషయాన్ని గ్రహించాలి’ అని తన లాంగ్ నోట్‌లో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story