నాకు ఆ ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదు : మమత

by srinivas |   ( Updated:2020-08-14 09:17:04.0  )
నాకు ఆ ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదు : మమత
X

దిశ, వెబ్ డెస్క్: నిబంధనలు వ్యతికంగా నడుస్తున్న గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత అన్నారు. విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడం వల్లే విచారణకు హాజరైనట్లు వెల్లడించారు. రమేష్ ఆస్పత్రి విషయంలో తనపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని ఆమె వివరించారు.

అయితే, రమేష్ ఆస్పత్రి మేనేజ్మెంట్ మెంబర్‌గా డాక్టర్ మమత పనిచేస్తున్నారు. ఆ ఆస్పత్రి మీద వచ్చిన ఆరోపణల వల్ల శుక్రవారం ఆమె విజయవాడ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. 6గంటలు పాటు సాగిన ఈ విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ.. విజయవాడ హాస్పిటల్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను కేవలం రమేష్ హాస్పిటల్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాలు మాత్రమేౌ పరిశీలిస్తున్నట్లు డాక్టర్ మమత వివరించారు.

ఇక ఆమె అడ్వకేట్ ఉమా శంకర్ మాట్లాడుతూ.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డాక్టర్ మమతను దాదాపు 7గంటలు విచారించడం తగదని అన్నారు. పూర్తిగా కోలుకోని ఆమె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, పోలీస్ వారికీ అంతకంటే ఎక్కువ ప్రమాదమన్నారు.పోలీస్‌శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నా.. ఇలా కరోనా పేషెంట్‌ను ఇబ్బంది పెట్టకూడదని ఆయన వెల్లడించారు.

తనకు సంబంధం లేని విషయంలో కరోనా బాధితురాలని పదేపదే ఇబ్బంది పెట్టడం తగదన్నారు. హాస్పిటల్, హోటల్ యాజమాన్యాలను నిందించే ముందు అసలు తప్పు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఫైర్ విభాగాలదని చెప్పారు. ముందస్తు పరిస్థితులు, స్థితిగతులు అధ్యయనం చేయకుండా జిల్లా కలెక్టర్, మున్సిపల్, ఫైర్, డీఎంహెచ్‌వోలు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. వాళ్లే సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఈలాంటి పరిస్థితులు వచ్చేవికాదని ఉమాశంకర్ తెలిపారు.

Advertisement

Next Story