ప్రధాని మోడీకి మరోసారి షాకిచ్చిన దీదీ..

by Shamantha N |
ప్రధాని మోడీకి మరోసారి షాకిచ్చిన దీదీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి షాకిచ్చారు. యాస్ తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని మోడీ శుక్రవారం ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి ఏరియల్ సర్వే చేశారు. తొలుత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఇక బెంగాల్‌లో మోడీ అధ్యక్షతన జరగాల్సిన సమీక్ష సమావేశానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు. ప్రధాని-సీఎం సమీక్షలో ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తే తాను రాలేనని ముందే తేల్చి చెప్పిన బెంగాల్ సీఎం అన్నట్టుగానే మీటింగ్‌కు గైర్హాజరు అయ్యారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తుపాను ప్రభావంపై చర్చలకు పిలిస్తే బెంగాల్ సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story