హ్యట్రిక్ కోసం తిప్పలు.. చాయ్ పే ప్రచార్..

by Shamantha N |   ( Updated:2021-03-09 08:43:04.0  )
హ్యట్రిక్ కోసం తిప్పలు.. చాయ్ పే ప్రచార్..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో(తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అసోం) జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రేంజ్‌లో రెండు పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు.

బెంగాల్‌లో హ్యట్రిక్ కోసం మమతా బెనర్జీ.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీదీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మమత.. ఈరోజు నందిగ్రామ్‌లోని ఓ హోటల్‌లో టీ తయారు చేసి అందరికీ తానే స్వయంగా టీ కప్పులు అందజేశారు. అయితే దీదీ.. నందిగ్రామ్‌లో రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం రోజున ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story