- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మమతా దీదీకీ స్థానం లేదు : మర్రి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కుమారి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌కు స్థానం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ నుండి బలమైన సవాల్‌ను తిప్పికొట్టడానికి టీఎంసీకి నాయకత్వం వహించడంలో ఆమె విజయం సాధించడంతో వారిప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై దృష్టి పెట్టారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్‌కు దక్షిణాదిలో అనుకూల పవనాలు ఉన్నాయని, మమతా బెనర్జీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఇటీవల వారు కర్ణాటకతో పాటు తెలంగాణలో కొంతమంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులను సంప్రదించినట్లు మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఎటువంటి ప్రభావముండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఇప్పుడు లేదని భవిష్యత్తు ఉండదని ఆ చోటును తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించవచ్చని టీఎంసీ భావిస్తే, అది వ్యర్థమైన కసరత్తు అవుతుందని తెలిపారు.
ఎలక్షన్ వ్యూహాలలో బాగా పేరు సంపాదించినా ప్రశాంత్ కిషోర్ పాత్ర పై కూడా అందరికీ పెను అనుమానాలున్నాయని అన్నారు. పీకే మోడీ-షా ద్వయానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని వారిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ పిలుపును చిలుకలాగా పలుకుతున్నట్లు చాలా మంది భావిస్తున్నారని తెలిపారు. బీజేపీని తీవ్రంగా, ఏకధాటిగా ఎదుర్కొంటున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మంచి గుర్తింపు, ఉనికి ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొన్నారు.