- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్మి తెస్తుండగా మల్లెమోని గ్రామస్తులపై కర్రలతో దాడి.. ప్లాన్ ప్రకారమే కరెంట్ తీసేసి..!
దిశ, పరిగి : దసరా పండుగ సందర్బంగా జమ్మి తీసుకుని ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై మరో వర్గం వారు దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపింది. జిల్లాలోని పరిగి మున్సిపల్ పరిధి 1వ వార్డు మల్లెమోని గూడ గ్రామంలో దసరా ఉత్సవాల్లో శమీ పూజ నిర్వహించి జమ్మి తీసుకు వస్తుండగా ఘర్ష ణ చెలరేగిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ మల్లెమోని గ్రామస్తులు శనివారం ఉదయం ఊరి నుంచి నిరసన తెలుపుతూ పరిగిలోని హైదరాబాద్–బీజాపూర్ అంతర్రాష్ర్ట హైవే 163పైకి చేరుకున్నారు. అనంతరం పరిగి బస్టాండ్ వద్ద హైవే పై వందలాది ప్రజలు బైఠాయించి నిరసన తెలిపారు. పండగను దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారమే జమ్మి తీసుకువస్తుండగా గ్రామంలో కొన్ని స్తంభాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి కర్రలతో తమపై దాడికి పాల్పడ్డారని మల్లెమోని గూడకు చెందిన ఓ వర్గం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై ఆగ్రహించిన మల్లెమోని గ్రామస్తులు హైవేపై రాకపోకలు నిలిపివేసి తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా వినాయక చవితి సందర్భంగా నిమజ్జన సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేసి దాడి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వారి తలలు పగిలేలా దాడి చేసిన ఓ వర్గం వారిని పిలిపించాల్సిందేనంటూ మొండికేశారు. తప్పు చేశారు కాబట్టే తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ తన సిబ్బందితో ధర్నా చేస్తున్న మల్లెమోని గూడ గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు పట్టువీడలేదు. హైవే పై గంటన్నర పాటు రాకపోకలు నిలిచిపోయేలా చేశారు.
పరిస్థితి చేజారుతుండటంతో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ధర్నా చేస్తున్న మల్లెమోని గూడ గ్రామస్తులను దాడికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధర్నా విరమించాలని గ్రామస్తులకు విన్నవించారు. దాడి చేసిన వారిని ఇక్కడికి పిలిపించి తమకు న్యాయం చేస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పారు. ఆ తర్వాత రోడ్డు క్లియర్ చేసి బస్టాండ్ నుంచి బాహార్‌పేట వరకు నిరసన ర్యాలీగా గ్రామస్తులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఇంటి ముందు వందలాది మల్లెమోనిగూడ గ్రామస్తులు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ గంట పాటు నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి గ్రామస్తులను శాంతింప జేసి.. ముందు సంతోషంగా దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ ఘర్షణకు కారకులెవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మరోమారు ఇలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఈ ధర్నా, నిరసన ర్యాలీలో డీఎస్పీ ఎం.శ్రీనివాస్, సీఐ లక్ష్మీ రెడ్డితో పాటు పరిగి, దోమ, పూడూరు ఎస్ఐలు రమేష్, శ్రీ శైలంతో పాటు సుమారు 20 తన సిబ్బందితో శాంతి భద్రతలు పర్యవేక్షించారు.