- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. ఆగస్టు 29 నుంచి అసలైన ఆట
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల తర్వాత జైలుకెళ్లడం తప్పదని తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ సమాధి కడతానని అన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఏం చేయలేరని, సోమవారం రాత్రి తన చానెల్‌పై దాడి జరగబోతోందన్న విషయం కూడా తనకు ముందే తెలుసని వ్యాఖ్యనించారు. నా కదలికలు కనిపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నరు గాని, కేసీఆర్ తీసుకునే ప్రతి చర్య, ప్రతి కదలిక తనకు ముందే తెలుస్తోందని అన్నారు. సోమవారం రాత్రి దాదాపు 50మంది పోలీసులు తన ఆఫీసులో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్క్‌లతో పాటు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకెళ్లారని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల డేటా తన వద్ద ఉందనే సమాచారంతోనే కేసీఆర్ ఈ దాడులు చేయించడాని ఆరోపించారు.
అయితే ముఖ్యమంత్రికి చేరిన సమాచారం వాస్తవమే అయినప్పటికీ వారు తీసుకెళ్లిన హర్డ్ డిస్కుల్లో మాత్రం సమాచారం లేదని, అసలు సమాచారం ఉన్న హర్డ్ డిస్క్‌లు ఇంకా భద్రంగానే ఉన్నాయంటూ తన శైలిలో కామెంట్ చేశారు. బుధవారం తీన్మార్ మల్లన్న టీం 7200 వరంగల్ ఉమ్మడి జిల్లా సభ్యుల కీలక సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి భూమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా తీన్మార్ మల్లన్న 7200టీం సభ్యులు ప్రజాక్షేత్రంలో పనిచేయబోతున్నారని అన్నారు. ఆగస్టు 29 నుంచి ఆట మొదలు కాబోతోందని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. చదువు రానివాళ్లు, వాస్తుకు లేనోళ్లు మంత్రులుగా ఉండటం దౌర్భాగ్యమంటూ తన శైలిలో విమర్శలు చేశారు.
విద్య, వైద్యమే మా ఎజెండా…
అందరికీ మెరుగైన విద్య, వైద్యం ఉచితంగా అందించడం కోసమే తీన్మార్ మల్లన్న టీం కొట్లాడబోతోందని అన్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను చాటిచెప్పబోతోందని అన్నారు. ప్రశ్నించే తత్వాన్ని నేర్పించబోతున్నాం. ఇంటికో తీన్మార్ మల్లన్నను తయారు చేయబోతున్నామంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అసమర్థులైన, కనీస చదువు లేని నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఎర్రబెల్లిని, సబితా ఇంద్రారెడ్డిలను ఎద్దేవా చేశారు. భూ కబ్జాలకు కేసీఆర్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, కేసీఆర్ దొంగ పాస్ పోర్టులు అమ్ముకున్న బ్రోకర్ అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి తూపాకీ రాముని ముచ్చట్లు చెబుతూ జనాలను మాయ చేస్తున్నాడని అన్నారు. రాజకీయ పార్టీలపై కాకుండా ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న టీం పోరాటం చేయబోతోందని, అది కూడా శాంతియుతంగా, కొట్లాటలు లేకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుల రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆగస్టు 29లోపు మండల, గ్రామ కమిటీలు పూర్తి చేయాలని కార్యకర్తలకు, నాయకులు దిశా నిర్దేశం చేశారు.
వరంగల్‌ను రాజధాని చేయాలి
కాకతీయులు ఏలిన ఓరుగల్లును రాష్ట్ర రాజధానిగా చేయాలని తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కాకతీయుల పేరును నిత్యం వల్లెవేస్తున్న ఈ ప్రభుత్వం వరంగల్‌కు మాత్రం తీరని అన్యాయం చేసిందని, ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. హైదరాబాద్ మహానగరం ఇప్పటికే కాలుష్యమయంగా మారిందని, ఈ పరిణామంలో వరంగల్‌ను రాష్ట్ర రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రసంగంలో పదేపదే ప్రస్తావించడం గమనార్హం. అంతకు ముందు పట్టణం చేరుకున్న మల్లన్నకు టీం సభ్యులు అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా అంబేద్కర్ భవన్‌కు చేరుకున్నారు. మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.