ముగిసిన మల్కాజిగిరి మాజీ ఏసీపీ కస్టడీ

by Shyam |
ముగిసిన మల్కాజిగిరి మాజీ ఏసీపీ కస్టడీ
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి మాజీ ఏసీపీ నరసింహారెడ్డి కస్టడీ గురువారంతో ముగిసింది. గతనెల 23న రెండు రాష్ట్రాల్లోని 25ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా విచారించేందుకు, ఈనెల 5నుంచి 8వరకు కస్టడీకి తీసుకొని కీలకమైన విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని సుమారు 2వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఇతరులతో కుమ్మక్కై.. వారి నుంచి కొనుగోలు చేసినట్టుగా, ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించిన విషయాలను ఏసీబీ పూర్తి సమాచారాన్ని సేకరించకలిగింది. ఇదే అంశంపై రెవెన్యూ అధికారులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం. అంతే కాకుండా, నర్సింహారెడ్డికి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు హోటళ్ల వ్యాపారాలు, అనంతపురంలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూమిని గుర్తించారు.

Advertisement

Next Story