- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరకట్నం వేధింపు కేసులో ఏడాది జైలు శిక్ష
దిశ, క్రైమ్ బ్యూరో: వరకట్నం వేధింపుల కేసులో అత్తమామలకు మల్కాజిగిరి కోర్టు బుధవారం ఏడాది జైలు శిక్ష విధించింది. సైనిక్‌పురికి చెందిన అనిషాకు విజయవాడకు చెందిన తెల్లా శ్రీకృష్ణతో వివాహమైంది. ఈ సమయంలో రూ.50 లక్షల వరకట్నంతో పాటు రూ.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఇచ్చారు. పెళ్లైన అనంతరం కాపురం కోసం విజయవాడకు వెళ్లిన దగ్గర్నుంచి భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. మరో రూ.25 లక్షలు పట్టుకు రావాలని చిత్రహింసలకు గురిచేసేవారు. ఆ సొమ్ము ఇవ్వలేకపోవడంతో ఆమె పేరుపై ఉన్న రూ.10 లక్షల డిపాజిట్‌ను ఆమె ద్వారా బలవంతంగా విత్ డ్రా చేయించి తీసుకున్నారు. అయినా కూడా భర్త శ్రీకృష్ణ అదనపు కట్నం ఇంకా తీసుకురావాలని కోరేవాడు. అంతే కాకుండా, అసభ్య పదజాలంతో దూషించడం, తరుచూ కొట్టడం, వివాహేతర సంబంధాల పేరుతో నానా రకాలుగా మానసికంగా కుంగదీశారు. దీంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో 2017 మార్చి 3వ తేదీన ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు, విచారణ అనంతరం బుధవారం మల్కాజిగిరి కోర్టు అత్తమామలకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. భర్తపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఈ కేసులో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.