20 నిమిషాలు.. 120 భాషలు.. 120 పాటలతో ప్రపంచ రికార్డ్

by Shyam |
20 నిమిషాలు.. 120 భాషలు.. 120 పాటలతో ప్రపంచ రికార్డ్
X

దిశ, ఫీచర్స్: కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన విద్యార్థి 16 ఏళ్ల మల్లాది రాహత్‌ 2018 జనవరి 6న దాదాపు 8 గంటలపాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వివిధ భాషల్లో 76 పాటలు పాడిన గజల్‌ శ్రీనివాస్‌ పేరిట ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేయడంతో పాటు, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించాడు. అయితే కేరళలోని కన్నూరుకు చెందిన సింగర్ సుచేత సతీష్ ఏడు గంటల 20 నిమిషాల్లో 120 భాషల్లో 120 పాటలను పాడి రాహత్ రికార్డ్‌ను బద్దలు కొట్టి.. గిన్నిస్ బుక్‌ రికార్డ్ సెట్ చేసింది.

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో తాజాగా జరిగిన ‘మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్’ కచేరీలో సుచేత ఈ ఫీట్ సాధించగా.. 29 ఇండియన్ లాంగ్వేజెస్, 91 ఫారిన్ లాంగ్వేజెస్‌లో టోటల్‌గా 120 సాంగ్స్ పాడింది. మలయాళ చిత్రం ‘ధ్వని’లోని ‘జానకి జానే’ అనే సంస్కృత పాటను ఆలపించడం ద్వారా తన రికార్డ్ సింగింగ్ జర్నీ ప్రారంభించిన సుచేత.. తన తల్లి సుమిత అయిలియాత్ రచనలో బాలీవుడ్ స్వరకర్త మాంటీ శర్మ స్వరపరిచిన హిందీ మెలోడితో కన్సర్ట్ ముగించింది.

మూడేళ్ల వయసులో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టిన సుచేత.. ఆ తర్వాత హిందుస్తానీపై పట్టు సాధించింది. సుప్రసిద్ధ ప్లే బ్యాక్ సింగర్ ఆశా మీనన్ ఆమెకు తొలి గురువు కాగా.. సుజాత హరీష్ కుమార్, జయప్రసాద్‌లు హిందూస్తానీలో ఓనమాలు నేర్పించారు. ఈ క్రమంలోనే సుచేత తన 12 ఏళ్ల వయసులో 102 భాషల్లో పాటలు పాడి అందరి దృష్టిని ఆకర్షించింది. వివిధ భాషల్లో పాటలు నేర్చుకోవడానికి దుబాయ్ మంచి వేదిక అయిందని.. భిన్నమైన భాషల్లో పాటలు పాడేటప్పుడు డిక్షన్ విషయంలో తన స్నేహితులు సహాయం చేశారని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed