కాఫీ డే సీఈఓగా మాలవిక హెగ్డే

by Harish |
కాఫీ డే సీఈఓగా మాలవిక హెగ్డే
X

బెంగళూరు: కేఫ్ కాఫీ డే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ వీజీ సిద్ధార్థ భార్య మాలవిక హెగ్డే నియమితులయ్యారు. గత ఏడాది వీజీ సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జూలైలో కాఫ్ డే ఎంటర్‌ప్రైజెస్ స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్‌కే రంగనాథ్‌ను మధ్యంతర చైర్మన్‌గా నియమించారు. కేఫ్ కాఫీ డే‌ సీఈఓగా మాలవిక హెగ్డేను నియమిస్తూ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా నిర్వహిస్తున్న కేఫ్ కాఫీ డేకు దేశవ్యాప్తంగా వందల కొద్దీ కాఫీ దుకాణాలు ఉన్నాయి. టీ ప్రేమికులు ఎక్కువగా ఉండే భారతదేశంలో కాఫీ దుకాణాల ద్వారా కాఫీ‌కి సిద్ధార్థ విస్తృతమైన గుర్తింపును తీసుకువచ్చారు. ఆయన మరణంతో కాఫీ డే భవిష్యత్తు సందిగ్ధంలో పడింది.

Advertisement

Next Story