అర్జున్.. నువ్వుంటే చాలు : మలైకా

by Shyam |
అర్జున్.. నువ్వుంటే చాలు : మలైకా
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫి‌ట్‌నెస్ దివా మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. మరోసారి హెడ్ లైన్స్‌లో నిలిచింది. అఫ్‌కోర్స్.. అర్జున్ కపూర్ మలైకాతో కలిసి దర్శనమివ్వడమే ఇందుకు రీజన్ కాగా, ప్రజెంట్ ఈ పిక్ వైరల్ అవుతోంది. మలైకా తన భర్త అర్బజ్ ఖాన్‌తో విడిపోయాక అర్జున్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధర్మశాలలో ‘బూత్ పోలీస్’ షూటింగ్‌లో ఉన్న తనతో కలిసి వెకేషన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తోంది మలైకా. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకున్న భామ.. ధర్మశాలకు వెళ్లి చాలా రోజులైనా సరే, కేవలం సింగిల్ ఫొటోలనే పోస్ట్ చేసింది. కానీ లేటెస్ట్ పోస్ట్‌లో అర్జున్‌ను హగ్ చేసుకుని స్మైల్ ఇస్తున్న ఫొటో పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది. అంతేకాదు ‘నువ్వు నాతో ఉంటే డల్ మూమెంటే ఉండదు’ అని చెప్తూ తన ఫీలింగ్స్ షేర్ చేసింది. సెలబ్రిటీలు ఈ ఫొటోపై పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటే.. నెటిజన్లు మాత్రం నెగెటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు. నీ కొడుకు పెరుగుతున్నాడు ఏం సమాధానం చెప్తావ్? అని కొందరు అంటుంటే.. ముందు పెళ్లి మీద క్లారిటీ ఇవ్వాలంటున్నారు.

మలైకా అరోరా ఫ్రెండ్ కరీనా కపూర్ కూడా ధర్మశాలలోనే స్పెండ్ చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కూడా బూత్ పోలీస్ సినిమాలో అర్జున్ కపూర్‌తో కలిసి కీ రోల్ ప్లే చేస్తుండగా.. ఇటు సైఫ్ కరీనా జంట, అటు అర్జున్ మలైకా జంట ధర్మశాల వెదర్ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Next Story