ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై మాల మహానాడు ఆగ్రహం

by Shyam |
ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై మాల మహానాడు ఆగ్రహం
X

దిశ, హుస్నాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు సిద్దిపేట జిల్లా నేతలు డిమాండ్ చేశారు. ఓ బాధ్యతగల పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు కేసు అంటూ అర్వింద్ వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత, గిరిజనుల పక్షాన పోరాడాల్సిన పార్లమెంట్ సభ్యులు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కులం పేరుతో దూషించి అవమానపరిచినందుకు భారత రాజ్యాంగం‌లోని.. ఆర్టికల్ 17 ప్రకారం కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో మాల మహానాడు, దళిత, గిరిజనులతో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు యాస శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జీ సావుల రాజమౌళి, కన్వీనర్లు బందెల హరీష్ బాబు, బత్తుల శ్రీనివాస్, బత్తుల సారయ్య తదితరులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సజ్జనపు శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed