- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి
దిశ, గుండాల : ఈ నెల 9న జరుగనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఈసం శంకర్ కోరారు. శనివారం గుండాలను ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో తరతరాలుగా ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కొని విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, హరితహారం పేరుతో అటవీశాఖ దాడులు నిలిపివేయాలన్నారు.
ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం పోడు భూముల రక్షణ కోసం ములకలపల్లి నుండి ప్రారంభమై కొత్తగూడెం వరకు జరిగే పాదయాత్ర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా ఆచరణలో మాత్రం శూన్యమని, ఆదివాసుల బతుకు దుర్భరంగా మారిందన్నారు. పోడు భూముల సమస్య, ఆదివాసుల హక్కులు పరిష్కారం కావాలంటే పోరాటమే మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో కుమరం శాంతయ్య, సనప సుగుణ రావు, కోడూరు జగన్, పూణే మంగయ్య, ఈసం సూరిబాబు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.