రిలీజ్ వాయిదావేసిన మహేశ్.. మామూలుగా ఉండదంటున్న అడివి శేష్

by Shyam |
రిలీజ్ వాయిదావేసిన మహేశ్.. మామూలుగా ఉండదంటున్న అడివి శేష్
X

దిశ, సినిమా : 26/11 టెర్రర్ అటాక్స్‌లో ముంబైవాసుల ప్రాణాలు కాపాడటంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి, ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్‌ఎస్‌జీ కమాండర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘మేజర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోనీ పిక్చర్స్‌తో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి శశికిరణ్ దర్శకత్వం వహిస్తుండగా అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ జులై 2న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొవిడ్-19 పాండమిక్ కారణంగా వాయిదావేస్తు్న్నట్టు స్టేట్‌మెంట్ ద్వారా తెలిపిన మేకర్స్.. పరిస్థితులు చక్కబడ్డాక విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ మేరకు సదరు స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అడివి శేష్.. ‘మేజర్ సినిమా విడుదల రోజు, నా జీవితంలో గర్వపడే క్షణం అవుతుంది. సమయం అనుకూలించాక సెలబ్రేట్ చేసుకుందాం. ఇంట్లోనే సేఫ్‌గా ఉండండి. నేను హామీ ఇస్తున్నా, థియేటర్లలో మామూలుగా ఉండదు. #JaiHind రిలీజ్ డేట్ తెలియజేస్తాం’ అంటూ పోస్ట్ చేశాడు.

Advertisement

Next Story