- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్టమర్లకు ప్రత్యేక ఈఎంఐ చెల్లింపుల వెసులుబాటు ఇవ్వనున్న మహీంద్రా
దిశ, వెబ్ డెస్క్: కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే పలు చర్యలు, కార్యక్రమాలను ప్రకటించాయి. తాజాగా దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా కొత్త పథకాలను ప్రకటించింది. కొత్తగా వాహనాలను కొనాలనుకునేవారికి చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియొగదారులెవరైనా వాహనాన్ని కొనే వారు ఎస్‌యూవీ లేదా కారు ఏదైనా నచ్చిన వాహనాన్ని ఇప్పుడు కొని, 3 నెలల తర్వాత ఈఎంఐ(నెలసరి వాయిదా) చెల్లించే అవకాశాన్ని ఇస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
నిత్యావసర సేవల వినియోగానికి కమర్షియల్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, మహీంద్రా కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ సేవలను అందించేందుకు ‘ఓన్ ఆన్‌లైన్’ ప్లాట్‌ఫామ్‌ను గతేడాది ప్రవేశపెట్టామని కంపెనీ తెలిపింది. ఈ సేవల ద్వారా ఆన్‌లైన్ వాహన రుణాలను అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే, ‘ఓన్ ఆన్‌లైన్’ ద్వారా వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 3 వేల విలువైన యాక్సెసరీలు, లోన్ మంజూరులో రూ. 2 వేల వరకు లబ్ది చేకూరుతోందని కంపెనీ వివరించింది.
అంతేకాకుండా వాహన యాక్సెసరీల ఖర్చులు, ఎక్స్‌టెంటేడ్ వారెంటీ చెల్లింపు, వర్క్‌షాప్ చెల్లింపులకు సంబంధించి వాటికి కూడా ఈఎంఐల రూపంలో మార్చుకునే వెసులుబాటు ఇస్తున్నామని తెలిపింది. ఇంకా, రూ. 3 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు పేర్కొంది. వాహనాలు కొనే సమయంలో 7.25 శాతం వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నామని, రూ. లక్షకు రూ. 799 తక్కువ ఈఎంఐతో ఎనిమిదేళ్ల కాలవ్యవధితో రుణాలిస్తున్నట్టు వెల్లడించింది.