- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్‌లోకి బ్రిటీష్ కాలంనాటి బైక్.. మహీంద్రా మాస్టర్ ప్లాన్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో స్థిరంగా కొనసాగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ మరోసారి తన పాత మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే తన పాత మోడల్ బైక్ జావాతో మార్కెట్లో మెరుగైన ఆదరణను సాధించింది. తాజాగా మరో క్లాసిక్ బ్రాండ్ అయిన ‘బీఎస్ఏ’ను తిరిగి మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. 40-50 ఏళ్లకు ముందు అంతర్జాతీయ మార్కెట్లో సైతం గుర్తింపు కలిగిన బీఎస్ఏ బ్రాండ్‌ను మళ్లీ వినియోగదారుల కోసం విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఫ్లయింగ్ కారుకు జపాన్ గ్రీన్ సిగ్నల్!
ప్రస్తుతం క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ నుంచి జావా, 42, పెరాక్ మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. వీటికి జతగా పాతకాలం నాటి బ్రిటిష్ మోటార్‌సైకిల్ బీఎస్ఏ బ్రాండ్‌ను తీసుకొస్తోంది. దీనిపై స్పందించిన కంపెనీ మొదట దీన్ని యూరప్ మార్కెట్లో విడుదల చేసి, ఆ తర్వాత భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెబుతోంది. మహీంద్రా సంస్థ ప్రస్తుతం క్లాసిక్ లెజెండ్స్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. 2022 చివరి నాటికి దేశంలో ఇప్పుడున్న 257 డీలర్‌షిప్‌లను 500కి పెంచాలని, దీనివల్ల రీటైల్ అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
డిసెంబర్ నాటికి 300 డీలర్‌షిప్‌లను పెంచాలనేది కంపెనీ లక్ష్యం. ఇదే సమయంలో పాత బ్రాండ్‌ను మళ్లీ వినియోగదారుల కోసం తీసుకురావడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, యమహా, హీరో, బెనెలీ బైకులకు పోటీ ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.