- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా జరుగుతున్న మహిళా ధ్యాన మహా చక్ర వేడుకలు..
దిశ, కడ్తాల్: ధ్యానసాధన చేసి ఆత్మజ్ఞానం పొందినవారు మానసిక భయాలు వీడి మనోధైర్యముతో ఆనందమయ జీవితాన్ని పొందుతారని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, ప్రపంచ ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పేర్కొన్నారు. కడ్తాల్ మండల సమీపంలో జరుగుతున్న మహిళా ధ్యాన మహా చక్ర వేడుకలు సోమవారం నాటికీ 7వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5గంటలకు సుభాష్ పత్రిజీ వేణునాదంతో ప్రారంభమై.. రాత్రి 9గంటలకు సాంస్కృతిక కార్యక్రమ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రపంచ ధ్యాన గురువు పత్రిజీ ధ్యానులకు ఉపదేశమిస్తూ.. ధ్యానం చేస్తే సంకల్పసిద్ధి లభిస్తుందన్నారు.
ప్రతి ఒక్కరు అహంకారం మాని పక్క ఒక్కరితో స్నేహాభావంతో మెలగాలని సూచించారు. ధ్యానం ప్రజలకు దివ్య ఔషధం లాంటిదని, రోగులకు వరములాంటిదని, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రష్టి చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, సభ్యులు సాంబశివరావు, హన్మంతరాజు, బాలకృష్ణ, లక్ష్మి, శ్రీరామ్ గోపాల్, జయశ్రీ, సౌమ్యకృష్ణ, దామోదర్ రెడ్డి, సురేష్ బాబు, రవి శాస్త్రి, శివ ప్రసాద్, మాధవి తదితరులు పాల్గొన్నారు.