పూరి ని విష్ చేసిన Mahesh Babu.. గొడవ సద్దుమణిగిందా..?

by Anukaran |   ( Updated:2021-09-28 05:26:57.0  )
పూరి ని విష్ చేసిన Mahesh Babu.. గొడవ సద్దుమణిగిందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ నేడు తన 55వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం పూరి జగన్నాధ్ కి విషెస్ తెలపడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. మహేష్ కి ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన పూరికి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపాడు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్, ఆనందం – మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా”.. అంటూ ట్వీట్‌లో మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

https://twitter.com/urstrulyMahesh/status/1442724474156040197?s=20

‘బిజినెస్ మెన్’ చిత్రం తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటలు లేవని అప్పట్లో పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు సైతం ఒక ఆడియో ఫంక్షన్ కి తనతో తీసిన దర్శకులందరిని పిలిచి పూరి ని పిలవకపోవడం, కనీసం ఆయన పేరును కూడా స్టేజిపై ఎత్తకపోవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు సడెన్ గా మహేష్ ఇలా పుట్టిన రోజు కి విష్ చేయడంతో వారిద్దరి ఆమధ్య గొడవలు తొలగిపోయినట్లే అని టాక్ వినిపిస్తోంది. పూరి – మహేష్ కాంబోలో ‘జనగణమణ’ అనే చిత్రం తెరకెక్కాల్సివుండగా.. ఈ విబేధాల కారణంగానే ఆ సినిమా ఆగిపోయినట్లు సమాచారం.

https://twitter.com/Charmmeofficial/status/1442726837856002049?s=20

ఇక మహేష్ ట్వీట్ కి హీరోయిన్ ఛార్మి రిప్లై ఇచ్చింది. “థాంక్యూ సో మచ్.. పూరి గారు లవ్ యూ చెప్పామన్నారు” అని తెలిపింది. బ్యాక్ టు బ్యాక్ వర్క్ వల్ల పూరీ జగన్నాథ్ ఈ ఏడాది జనవరి 11 నుంచి సోషల్ మీడియాకు దూరమయ్యారు. అందువల్లనే, పూరీకి విషెస్ చెప్పిన వారందరికి ఛార్మీనే రిప్లై ఇస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మళ్లీ వీరిద్దరూ కలిస్తే.. మూడో హిట్ ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు.

Advertisement

Next Story