స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన మహేశ్..

by Anukaran |   ( Updated:2020-11-17 07:05:01.0  )
స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన మహేశ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండియా తిరిగొచ్చేశారు. దుబాయ్‌లో ఫ్యామిలీతో కలిసి షార్ట్ వెకేషన్ పీరియడ్ ఎంజాయ్ చేసిన మహేశ్.. భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి అక్కడే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వన్ వీక్ అక్కడే ఎంజాయ్ చేసిన మహేశ్ అండ్ ఫ్యామిలీ.. మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సూపర్ స్టైలిష్ లుక్‌లో మీడియాకు కనిపించిన ప్రిన్స్.. డెనిమ్ జీన్స్, కూల్ హుడీ, కూలింగ్ గ్లాసెస్‌తో సూపర్ కూల్‌గా ఉన్నారు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.

కాగా ఇదే లుక్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్టులో తీసిన మహేశ్ పిక్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన నమ్రత.. ఉదయం మూడు గంటలకు ఎవరు ఇలా కనిపిస్తారు చెప్పండి? అని కామెంట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే పోస్ట్‌కు తెగ లైక్స్ పడిపోగా.. మహేశ్ ట్రెండింగ్‌ లుక్‌తో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

Advertisement

Next Story