మహేష్, నమ్రత పర్‌ఫెక్ట్ కపుల్

by Shyam |
మహేష్, నమ్రత పర్‌ఫెక్ట్ కపుల్
X

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు… ఒకరినొకరు అర్ధం చేసుకుని నడుచుకుంటారు. మహేష్ సినిమాలతో బిజీగా ఉంటే నమ్రతా వ్యాపారం, పిల్లలతో బిజీ బిజీగా ఉంటుంది. ఇద్దరు సమాన బాధ్యతలతో చక్కగా కాపురం చేస్తున్నారు. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకుని 15 ఏళ్లు గడిచిన సందర్భంగా మహేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ హ్యాపీ 15 మై లవ్ నీపై ఉన్న ప్రేమ రోజురోజుకు పెరుగుతూనే ఉంది’ అంటూ నమ్రతపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు.

దీనిపై స్పందించిన నమ్రత ‘ మహేష్, ప్రతీ అమ్మాయి కలలు కనే జీవితాన్ని అందించావు.. నా జీవితం ప్రేమతో నిండేలా చేశావు… ఇద్దరు పిల్లలు, ఇల్లు… అంతకన్న గొప్ప నీ స్నేహం.. ఇంతకు మించి ఏం అడగాలి నిన్ను .. లవ్ యూ ‘ అని రిప్లై ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఈ పర్‌ఫెక్ట్ కపుల్ లవ్ పోస్ట్‌ను చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు మురిసిపోతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.

Advertisement

Next Story