మహేష్‌తో సారా అలీఖాన్ రొమాన్స్ ?

by Shyam |
మహేష్‌తో సారా అలీఖాన్ రొమాన్స్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత చిత్రం గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తర్వాతి చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఉంటుందని భావించారంతా. ఈ కాంబినేషన్‌తో ‘మహర్షి’ లాంటి మరో హిట్ మహేష్ ఖాతాలో చేరిపోతుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్తా అటకెక్కింది. దీంతో ‘గీతా గోవిందం’ దర్శకుడు పరశురాం మహేష్‌ను కలిశాడని.. కథ నచ్చడంతో ప్రిన్స్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ డిసైడ్ అయింది. దీని మీద అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా… ఇదే మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ అనేది ఫిల్మ్ నగర్ టాక్.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు మొదట వార్తలొచ్చాయి. ఆ తర్వాత మహేష్ ‘మహానటి’ హీరోయిన్ కీర్తి సురేష్‌నే కోరుకుంటున్నాడని గుసగుసలు వినిపించాయి. ఇదంతా కాదని ఇప్పుడు మరో హీరోయిన్ తెరపైకి వచ్చింది. బాలీవుడ్ క్యూట్ గాళ్ సారా అలీఖాన్‌తో ప్రిన్స్ రొమాన్స్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. సారా, మహేష్‌లు జంట తెరపై బాగుంటుందని దర్శక, నిర్మాతలు తనకే ఓటేశారట. ‘కేదారినాథ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా తర్వాత ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’ మూవీస్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో ‘కూలీ నంబర్. 1’ సినిమాలో రొమాన్స్ చేస్తోంది సారా.

Tags : Mahesh Babu, Sara Ali Khan, Bollywood, Tollywood, Parasuram

Advertisement

Next Story

Most Viewed