RRR మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

by Shyam |   ( Updated:2021-12-21 12:13:40.0  )
mahesh - rajamouli news
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు చాలా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్, ప్రభాస్ రాదే శ్యామ్, ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలో ఉన్నాయి. దీనితో దర్శకులు, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలన్ని ఒకేసారి విడుదల అవుతే నిర్మాతలకు నష్టాలు తప్పవు. దీంతో వీరంతా కలిసి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. అయితే తాజాగా.. రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్‌కు థ్యాంక్స్ చెప్పాడు.

దీనితో పాటుగా సర్కార్ వారి పాట సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించినందుకు హీరో మహేష్ బాబు‌కు ధన్యవాదాలు తెలియజేశారు రాజమౌళి. దీనికి స్పందించిన మహేష్ బాబు ‘ఎప్పటి నుండో చెప్పేది సార్.. మీరు చేసే సినిమాలంటే మాకు అందరికీ ప్రేమ, గౌరవం’ అని రిప్లే ఇచ్చాడు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నేనే వేచి ఉండలేకపోతున్నని తెలిపాడు. ఏదైమైనా స్టార్ హీరోలు, దర్శకులు పంతాలకు పోకుండా ఇలా సన్నిహితంగా మెలగడం శుభపరిణామం.

Advertisement

Next Story