- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్‌ను బీజేపీ, మోడీ అనుసరించాలి : నవాబ్ మాలిక్
ముంబయి : సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీని తప్పని రాహుల్ గాంధీ అంగీకరించారని, అదే దారిలో గుజరాత్ అల్లర్లూ తప్పని బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒప్పుకోవాలని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ విధింపు ముమ్మాటికీ తప్పేనని 45 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ అంగీకరించారని, 1984లో సిక్కుల ఊచకోతకూ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పిందని వివరించారు. ఇప్పుడు బీజేపీ, ప్రధానమంత్రి వంతుగా గుజరాత్ అల్లర్లూ తప్పేనని అంగీకరించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పాత తప్పునకు రాహుల్ క్షమాపణలు చెప్పడం సబబేనని, అది గొప్ప లక్షణమని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానాపటోలే తెలిపారు. గుజరాత్ అల్లర్లు మానత్వానికే మరక అని, వాటికి బీజేపీ, ప్రధాని క్షమాపణలు చెప్పగలరా? అని అడిగారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యలపై బీజేపీ మహారాష్ట్ర ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే మాట్లాడుతూ, ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించిందని అన్నారు. గుజరాత్ అల్లర్లు అందుకు భిన్నమైనవని తెలిపారు. ఎమర్జెన్సీ, గుజరాత్ అల్లర్లను పోల్చలేమని వివరించారు.