- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఛీ..ఛీ.. వీడు డాక్టరేనా.. క్లినిక్ మాటున మహిళలతో అలా చేస్తూ..
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో శిశు విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయి. అప్పుడే పుట్టిన శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ నడుపుతూ శిశువులను విక్రయిస్తున్న డాక్టర్‌తో పాటు ముగ్గురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్ర నవి ముంబయి నగరంలోని కామోతే ప్రాంతంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్‌లో నవజాత శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రణాళిక ప్రకారం కామోతే సెక్టార్ 8లో క్లినిక్ మాటున పంకజ్.. రూ.4 లక్షలకు నవజాత శిశువులను అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఎలాగైనా ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు.. ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి పథకం వేశారు. అనుకున్నదే తడువుగా ఓ వ్యక్తిని శిశువు కొనుగోలు చేయడానికి ఆసుపత్రికి పంపించారు.
అయితే పోలీసుల పథకం అని గ్రహించని వైద్యుడు పంకజ్ పాటిట్ శిశువును విక్రయిచడానికి, రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డాక్టర్ పాటిల్ డిమాండ్ చేసిన రూ.4 లక్షల మొత్తాన్ని వ్యక్తి తీసుకెళ్లాడు. దీంతో డబ్బు చూసిన డాక్టర్, పసికందును విక్రయించాలని భావించి మహిళలకు ఫోన్ చేసి క్లినిక్‌కి రమ్మని చెప్పాడు. తలోజాకు చెందిన ముగ్గురు మహిళలు ఆడబిడ్డతో క్లినిక్‌కి వెళ్లారు. ఒప్పందం ప్రకారం.. పాటిల్ డబ్బు తీసుకొని శిశువును అప్పగించాడు. దీంతో ఈ శిశు విక్రయాల విషయం వెలుగులోకి వచ్చింది. క్లినిక్ మాటున ఇంత దారుణానికి ఒడిగడుతున్న డాక్టర్‌తో పాటు ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.