అక్కడ హోం ఐసొలేషన్ వద్దు.. ఆస్పత్రిలోనే చేరాలని ఆదేశాలు

by Shamantha N |
House Isolation
X

ముంబై: కరోనా కట్టడిలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సగటు పాజిటివిటీ రేటు కంటే అధికంగానున్న 18 జిల్లాల్లో కరోనా పేషెంట్లకు హోం క్వారంటైన్‌ను నిలిపేసి అందరినీ ఆరోగ్య కేంద్రాల్లో చేర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 18 జిల్లాల్లో అదనంగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి యాక్టివ్ కేసులందరినీ అందులో చేర్పించి చికిత్సనందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మంగళవారం 18 జిల్లాల కలెక్టర్లున ఆదేశించారు. సాధారణంగా ఇప్పటి వరకు లక్షణాలు లేనివారిని, స్వల్ప లక్షణాలున్న పేషెంట్లు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వారి హై రిస్కు, లో రిస్కు కాంటాక్టులనూ గుర్తించి టెస్టులు చేయాలని మంత్రి తెలిపారు. ర్యాండమ్ టెస్టులు చేసి పాజిటివిటీ రేటు తగ్గించాలనే ప్రయత్నాలు వద్దని, కచ్చితంగా టెస్టులు చేయాలని, గ్రామీణంలోనూ టెస్టులపై, టీకాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఆశా వర్కర్లకు ర్యాపిడ్ టెస్టు చేసేలా శిక్షణ అందించాలని, సెల్ఫ్ యూజ్ కిట్లపైనా అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

Next Story