కాళేశ్వరంలో మహారాష్ట్ర కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పూజలు

by Sridhar Babu |
Collector-pooja1
X

దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని శుక్రవారం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కలెక్టర్ సంజయ్ మీన్, అడిషనల్ కలెక్టర్ ధనాజీ పటేల్, అడిషనల్ ఎస్పీ సమీర్ షేక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుబంధ దేవాలయమైన శుభానందాదేవి(పార్వతి) అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు ప్రధాన రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Advertisement

Next Story