రేపటి నుంచి ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు

by Shyam |   ( Updated:2021-07-16 22:32:01.0  )
రేపటి నుంచి ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు
X

దిశ, బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రథమ శుక్రవారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ గర్భగుడి ప్రాంగణంలో వివిధ రకాల కూరగాయలు పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ప్రథమ శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు కుంకుమార్చన అభిషేకాలు అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ మాట్లాడుతూ.. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప ఆలయంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం ప్రసిద్ధి గాంచినదని అన్నారు..అత్యంత పవిత్రమైన, మహిమగల దేవతగా అమ్మవారు విరాజిల్లుతున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులు దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

అమ్మవారి సేవలు వీరమాచినేని విజయ చౌదరి

vijaya chowdaryసికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అమ్మవారికి శుక్రవారం రోజు శాకాంబరీ అలంకరణ చేపట్టడంతో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం టీఆరఎస్ మహిళా విభాగం నాయకురాలు వీరమాచినేని విజయ చౌదరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు ఓడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకురాలు వీరమాచినేని విజయ చౌదరి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో భక్తులను ఎల్లవేళలా కాపాడాలని విజయ చౌదరి అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

Advertisement

Next Story