- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నివారణ కోసం మహా మృత్యుంజయ యాగం
దిశ,జహీరాబాద్: కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కరోనా వైరస్‌ను అదుపు చేయడానికి అటు ప్రభుత్వాలు నడుం బిగించాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కరోనా నివారణ కోసం నేటి నుండి 41రోజుల పాటు మహా మృత్యుంజయ యాగం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ వెల్లడించారు, ఆయన ఆదివారం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆత్మస్థైర్యం తో కరోనాను జయించవచ్చు నని తెలిపారు.
ప్రభుత్వాలు, వైద్యులు సంబంధిత అధికారులు కరోనా నివారణ కోసం తమ వంతు కృషి అభినందనీయమన్నారు, ప్రభుత్వ అధికారులు, వైద్యుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరు టెస్టులకు వెళ్లాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికితోడు దేవుడి అనుగ్రహం కూడా కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకని ఆశ్రమంలో సోమవారం నుండి దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్, విశ్వమానవ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యజ్ఞశాలలో మహా మృత్యుంజయ యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజూ జ్యోతిర్లింగాలకు అఖండ జలాభిషేకం,గోపూజ, మహా మృత్యుంజయ జపం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటిస్తూ ధ్యానం యోగ చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.