మాగ్మా ఫిన్‌కార్ప్ ఛైర్మన్‌గా అదర్ పూనావాలా

by Harish |
మాగ్మా ఫిన్‌కార్ప్ ఛైర్మన్‌గా అదర్ పూనావాలా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నాన్-బ్యాంకింగ్ సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలాను నియమిస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు మాగ్మా ఫిన్‌కార్ప్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా అభయ్ భుటండాను నియమించుకుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ కరోనా టీకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో అదర్ పూనావాల్ నేతృత్వంలోని రైజింగ్ సన్ హోల్డింగ్స్ రూ. 3,456 కోట్ల ఈక్విటీ ఇన్‌ఫ్యూజర్ ద్వారా మాగ్మా ఫిన్‌కార్ప్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త నాయకత్వ మార్పులు చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, మాగ్మా ఫిన్‌కార్ట్ సీఈఓగా విజయ్ దేశ్‌వాల్‌ను నియమించగా, ఆయన జులై మొదటివారంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతేకాకుండా అదర్ పూనావాలా కంపెనీ గ్రూప్ ఆర్థిక సేవల సీఈఓగా కూడా బాధ్యతలను నిర్వహించనున్నారు.

Advertisement

Next Story