- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛలో ఢిల్లీకి సిద్దం కండి.. రిజర్వేషన్ కోసం భారీ ధర్నా..
by Sridhar Babu |
X
దిశ, మణుగూరు: రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరికి 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని బాపూజీ నగర్ గ్రామంలో మండల మాదిగ జేఏసి నాయకులతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీల రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందన్నారు.
మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి రవి నేతృత్వంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో డిసెంబర్ 13, 14 తేదీల్లో జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story