మధ్యప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం

by Shamantha N |
మధ్యప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఆహార కల్తీ నేరానికి జీవిత ఖైదు విధించే నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ క్యాబినెట్ తీసుకుంది. ఆహారాన్ని కల్తీ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, ఈ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి శిక్షా స్మృతిలోని సెక్షన్‌లను సవరిస్తున్నట్టు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఇటీవలే వెల్లడించారు. ఈ నిబంధనల్లో సవరణలకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ శుక్రవారం ఆమోదించినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు.

ఆహార పదార్థాలను కల్తీ చేస్తే జీవిత ఖైదు విధించడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. కల్తీ చేయడం అతిపెద్ద నేరమని, అది నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఈ నేరానికి తొలుత ఆరు నెలల జైలు శిక్ష అమల్లో ఉండేది. తర్వాత ఆ శిక్షను మరింత కఠినతరం చేస్తూ మూడేళ్ల కారాగార పరిమితికి పెంచారు. తాజాగా, జీవిత ఖైదు విధించడానికి నిర్ణయం తీసుకున్నారు. కల్తీతో పాటు కాలం చెల్లిన ఉత్పత్తుల అమ్మకాలకూ శిక్ష విధించే చట్టానికి ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర మంత్రి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed